పోయిన ఫోన్ ని పట్టుకొని భాదితులకి అప్పగించిన పోలీసులు..

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
ఒక నేల క్రితం అనగా 02.06.2024  నాటి నుంచీ ఈ రోజు వరకు పోయినటువంటి మొబైల్స్ ను శుక్రవారం బాధితులకు  అందజేసినట్లు రూరల్ ఎస్ ఐ వి సంతోష్ కుమార్ తెలిపారు. వివరాలను పరిశీలిస్తే  రాయగిరి X రోడ్ కాడా బొర్రా రవి అనే అతని మొబైల్ వివో  i57 ఖరీధు రూ.20000 , స్వర్ణగిరి టెంపల్ కాడా చిలీ రేణుక అనే మహిళా యొక్క సమ్ సంగ్ ఖరీధు రూ.22,999, వీరవెల్లి గ్రామానికి చెంధీన చిన్నం అంజయ్య యొక్క మొబైల్ పోకో ఖరీధు రూ.18,999, వడైగూడెం గ్రామానికి చెంధీన కోలా మల్లేశ్ వల్ల యొక్క మొబైల్ మోటోరోలా ఖరీధు రూ.19,999 వల్ల మొబైల్ పోవడంతో భువనగిరి రూరల్ పోలీసు స్టేషన్ లో పిర్యాధు ఇవ్వగా వీళ్ళ మొబైల్ వివరాలు సిఈ ఐ ఆర్ పోర్టల్ లో నమోదు చేసి ఐఎంఈ ఐ  నంబర్స్ ఆధారంగా అట్టి మొబైల్ ఆచూకీ కనిపెట్టి భాదితుడికి అతని మొబైల్ ని భువనగిరి రూరల్ పోలీసులు అప్పగించారు. ఫోన్ ఆచూకీ కోసం కృషి చేసిన భువనగిరి క్రైమ్ కానిస్టేబుళ్లు  జి చెన్నకేశవులును   భువనగిరి రూరల్ ఎస్‌ఐ వి సంతోష్ కుమార్ అభినందించారు. ఎవరైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నట్లైతే ఐఎంఈఐ వివరాలు, బాధితుడి ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇస్తే మొబైల్ ఫోన్ ఆచూకీ తెలుసుకొని భాధితులకు అందజేస్తామని ఎస్‌ఐ వి సంతోష్ కుమార్ తెలిపారు. భాదితులు పోలీస్ స్టేషన్ కి రాలేక పోయే పరిస్థితిలో ఉంటే సిఐ పోర్టల్ లో కూడా అప్లై చేసుకోవచ్చునని తెలిపారు.
Spread the love