అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి

The problems of Anganwadis should be solvedడిమాండ్ల సాధనకు అంగన్వాడీ ఉద్యోగులు సైతం సమ్మె బాట పట్టారు. సమస్యల పరిష్కారం కోరుతూ పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోకపోవడం, సమ్మె నోటీసులు అందజేసినా ప్రభుత్వం నుంచి చలనం లేకపోవడంతో.. సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సీఐటీయూ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె ప్రారంభించారు. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించే వరకు సమ్మెను విరమించబోమని వారు స్పష్టం చేస్తున్నారు.
నవతెలంగాణ-సిద్దిపేటఅర్బన్‌

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ను క్రమబద్ధీకరించే వరకు సమ్మె కొనసాగుతుందని అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు పద్మ సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యులు రవికుమార్‌ అన్నారు. అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ నిరవధిక సమ్మెలో భాగంగా సోమవారం సిద్దిపేటలో మండల కార్యాలయం సమీపంలో సమ్మె ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనం అమలు చేసి ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యాలు కల్పించి తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలన్నారు. సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగుతుందన్నారు.
తాళాలు పగలగొట్టిన సిబ్బంది..
సమ్మె కోసం అంగన్వాడీ ఉద్యోగులు సెంటర్లకు తాళాలు వేసుకుని వెళ్లడంతో.. సెంటర్‌ తాళాలను ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థాయి అధికారులతో కలిసి పగలగొట్టారు. అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ సమ్మె చేస్తున్న చోట గ్రామస్థాయి వీవోఏలకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు వారు తెలిపారు.
అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టడం దారుణం...
సమ్మెలో పాల్గొంటున్న అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ కు సంబంధించిన అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టి ఇతరులకు బాధ్యతలను అప్పగించేలా వ్యవV ారించడం దౌర్జన్యమే అవుతుందని అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు పద్మ అన్నారు. సమ స్యల పరిష్కారం కోసం పోరాటం చేసే హక్కు తమకు ఉంద ని.. పోరాటం చేసిన ప్రతీ ఉద్యోగి తాళాలు పగలగొట్టి విధులను ఇతరులకు అప్పగిస్తున్నారా అని ప్రశ్నించారు. ఎటువంటి నోటీస్‌ ఇవ్వకుండా.. ఎటువంటి హెచ్చరికలు లేకుండా తాళాలు పగలగొట్టడం చట్ట విరుద్ధమే అవు తుందన్నారు. దీనిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. సెంటర్‌ పరిధిలో పిల్లలకు ఎటువంటి ఇబ్బ ంది కలిగిన ఏం జరిగినా ప్రభుత్వం సంబంధిత సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులే బాధ్యత వహించాల్సి వస్తుంద న్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌హెల్పర్స్‌ సీఐటీయూ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కొండాపూర్‌ : కొండాపూర్‌ మండల కేంద్రంలో జరిగిన సమ్మెలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో సుమారు 70 వేల మంది అంగ న్వాడీ ఉద్యోగులు పనిచేస్తున్నారన్నారు. గత 45 ఏండ్లుగా ఐసిడిఎస్‌లో పనిచే స్తూ పేద ప్రజలకు సేవలు అందిస్తు న్నారన్నారు. అయిప్ప టికీ వారికి కనీస వేతనం, పెన్షన్‌, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత తదితర చట్టబద్ధ సౌకర్యాలు ఏవి రాష్ట్ర ప్రభుత్వం నేటికీ కల్పించడం లేదని మండిపడ్డారు. తమిళనాడు, కర్ణాటక, పశ్చిమబెంగాల్‌, కేరళ, అస్సాం, తదితర రాష్ట్రంలో హెల్త్‌ కార్డులు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, పెన్షన్‌, పండగ బోనస్‌తోb ాటు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ వంటి సౌకర్యాలు అమలు చేసు ్తన్నారన్నారు. కానీ తెలంగాణలో మాత్రం ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదన్నా రు. అంగన్వాడీ ఉద్యో గులను వెంటనే పర్మినెంట్‌ చేయాలన్నారు. వారికి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఐసిడిఎస్‌కు బడ్జెట్‌ పెంచి బలోపేతం చేయాలన్నారు. పక్కా భవనాలు, మౌలిక వస తులు కల్పిం చాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ టీచర్లకు పది లక్షలు, హెల్పర్లకు ఐదు లక్షలు, వేతనంలో సగం పెన్షన్‌ నిర్ణ యించాలని, ప్రమాద బీమా సౌకర్యం 5 లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడి ఉద్యో గుల సమస్యల పరిషకరమే లకష్యంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చ రించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ కొండాపూర్‌ మం డల కన్వీ నర్‌ బాబురావు, గ్రామపంచాయతీ యూనియన్‌ నాయకులు వెంకయ్య, సంజీవులు, ఐకేపి యూనియన్‌ జ్యోతి, మమ్మీ శ్రీ, అన్నపూర్ణ, లక్ష్మి, అంగన్వాడి యూనియన్‌ నాయకులు, ఏసు మని, భ్రమరాంబ, అరుణ, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
అమీన్‌పూర్‌ : మండల తహసీల్దార్‌ కార్యాలయం వద్ద చేప ట్టిన సమ్మెలో సీఐటీయూ సంగారెడ్డి జిల్లా కోశాధికారి నర్సింహరెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలతో వెట్టి చాకిరి చేయించు కుంటున్నాయన్నారు. వారికి కనీస వేతనం, ఇతర చట్టపరమైన సౌకార్యాలు కల్పించడం లేదన్నారు. అనేక సందర్భాలలో సమ్మెలు, పోరా టాలు చేసినప్పటికీ.. ప్రతీసారి హామీలిచ్చి అమలు చేయకb ోవడం వల్లే సమ్మెకు దిగాల్సి వచ్చిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే పోరాటం ఉదతం చేస్తావ న్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల నాయ కులు జార్జ్‌,శ్రీనివాస్‌, టీచర్‌లు కవిత, రాణి, లక్ష్మీ, మదవి అయాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పటాన్‌చెరు : అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్క రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు ప్రభు త్వంపై మండిపడ్డారు. సమస్యల పరిష్కారం కోసం సోమవారం పట్టణంలోని మండల పరిషత్‌ దుకాణాల సముదాయం ఎదుట చేపట్టిన అంగన్వాడీ ఉద్యోగుల సమ్మెను సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 20 రోజుల క్రితం సమ్మె డిమాండ్స్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చిన స్పందన లేదన్నారు. తప్పని పరిస్థితుల్లో సమ్మె కు దిగవలసి వచ్చిందన్నారు. అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం రూ.26 వేలకు పెం చాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటి చెల్లించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మ, ఏసుమని, విటలమ్మ, ప్రమీల, రాణి, అనిత, నవనీత, మంజుల, కల్పన, విజయ లక్ష్మి,నాగలక్ష్మి, రాధిక పాల్గొన్నారు.

Spread the love