టీఎఎంసీలోని రక్షణ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి

– బోయినిపల్లి వినోద్ కుమారుకు వినతిపత్రమందజేత 
నవతెలంగాణ-బెజ్జంకి 
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో పనిచేస్తున్న రక్షణ సిబ్బంది సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్ కు బెజ్జంకి ఎఎంసీ రక్షణ సిబ్బంది లక్ష్మి గణపతి వినతిపత్రమందజేశారు.1994 నుండి మార్కెట్ యార్డ్ కార్యలయం, చెక్ పోస్ట్, గోదాముల వద్ద రాత్రింబవళ్లు పనిచేస్తున్నామని..ఏజెన్సీ ద్వార చెల్లించే వేతన విధానాన్ని రద్ధు చేసి నేరుగా అందించి ఉద్యోగ భద్రత కల్పించాలని లక్ష్మి గణపతి విజ్ఞప్తి చేశారు. తమ వినతిపత్రాన్ని పరిశీలించి వినోద్ కుమార్ సానుకూలంగా స్పందించినట్టు రక్షణ సిబ్బంది తెలిపారు.
Spread the love