– సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దుబ్బాక రామచందర్
నవతెలంగాణ-కందుకూరు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీవోఏల సమస్యలు పరిష్కరిం చాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దుబ్బాక రామచందర్, సీఐ టీయూ మండల కన్వీనర్ బుట్టి బాలరాజు అన్నారు. కందుకూరు మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీవోఏలు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం 37వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 రోజుల నుంచి వీవోఏలు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోకపోవడం సరైం ది కాదన్నారు. డ్వాక్రా సంఘాల పని తీరు మెరుగు పరచ డానికి వీవో ఏలు నిరంతరం కృషి చేస్తామ న్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వీవోఏ లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బి.శ్రీనివాస్, మండల కమిటీ సభ్యులు ఎ.కుమార్, నాయకులు సత్యం,వీవోఏలు రజిత, మాధవి, రాధ, శారద, పావని, రజిని, జయ, సంగీత, మంజుల, పద్మ, రామచంద్ర రెడ్డి పాల్గొన్నారు.