నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలో నిర్వహించే ఓటు అనుసంధాన ప్రక్రియను బీఎల్ఓ లు బీఎల్ఏ ల తో సమన్వయం చేసుకుని విజయవంతం చేయాలని తహశీల్దార్ దాసరి కిషోర్ సూచించారు. ఓటర్ల జాబితాల ఆధారంగా మృతి చెందిన,ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన, 18 ఏళ్ళు నిండిన ఓటర్లను ప్రత్యేకంగా గుర్తించి తదనుగుణంగా నిర్దేశిత ఫారాలను పూర్తి చేసి అందించాలని స్పష్టం చేశారు. స్థానిక రైతు వేదికలో గురువారం బీఎల్ఓ లు,బీఎల్ఏ లకు శిక్షణా కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన ఓటు అనుసంధాన ప్రక్రియ ప్రాధాన్యతను వివరించారు. అనంతరం మాస్టర్ ట్రైనీ లు ఉపేందర్రెడ్డి, శంకర్ లు సర్ ప్రక్రియపై శిక్షణనిచ్చారు.కార్యక్రమంలో ఎన్నికల విభాగం డిప్యూటీ తహశీల్దార్ సయ్యద్ హుస్సేన్,ఆర్ఐ లు కృష్ణ, పద్మావతి, సూపర్వైజర్ లు,బీఎల్ఓ, బీఎల్ఏ లు పాల్గొన్నారు.



