
నవతెలంగాణ-డిచ్ పల్లి : ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నీయోజకవర్గ ప్రజలకు డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీ నేరవేర్చిన సందర్భంగా బిఅర్ఎస్ మండల అధ్యక్షులు చింత శ్రీనివాస్ రెడ్డి అధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలో కెసిఆర్ కెటిఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, యువ నాయకుడు, దర్పల్లి జడ్పీ టీసి బాజిరెడ్డి జగన్ మోహన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిచ్పల్లి మండల కేంద్రానికి డిగ్రీ కళాశాల మంజూరు చేస్తానని ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని గతంలో ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట నెరవేర్చుకోవడం జరిగిందన్నారు. దీని గాను మండలంలోని విద్యావేత్తలు, పార్టీల నాయకులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాజీ మండల అధ్యక్షులు శక్కరకొండ కృష్ణ, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మోహన్ రెడ్డి, రైతు బందు అధ్యక్షులు నారాయణరెడ్డి, నాయకులు నల్లవెల్లి సాయిలు, ఓడ్డం నర్సయ్య, డాక్టర్ షాదుల్లా, అంబర్ సింగ్ రాథోడ్, నల్ల హరికిషన్, విట్టల్ రాథోడ్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ప్రమోద్, విశ్వ ప్రకాష్, రామకృష్ణ, పోతర్ల రవి, సుధాం గిరి యూత్ అధ్యక్షుడు షేక్ అమీర్, కో-ఆప్షన్ సభ్యులు షేక్ నయీమ్, నాయకులు కార్యకర్తలు పాల్గొని టైగర్ బాజిరెడ్డి గోవర్ధన్ కు ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులకు కలుగుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని, పక్షాన ఉండి విద్యార్థుల కోసం డిగ్రీ కళాశాలకు ఎన్నోసార్లు కృషి చేసిన యువ నాయకులు బాజీరెడ్డి జగన్ మోహన్శకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.