కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

– సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-ముదిగొండ
ఎన్నికల కోడ్‌ ముగియనునందున శాసనసభ ఎన్నికల సందర్భంగా అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు కోరారు.ముదిగొండ మచ్చా వీరయ్య భవనంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు సామినేని రామయ్య అధ్యక్షతన బుధవారం మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రూ 5 లక్షల కోట్ల అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రంలో అమలు కానీ హామీలు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు నెలకు రూ.2500, కౌలు రైతులకు ఇస్తామని చెప్పిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. ఈనెల 22, 23 తేదీలలో పార్టీ కార్యకర్తలకు మండల స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు వాసిరెడ్డి వరప్రసాద్‌, మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం, మండల నాయకులు మంకెన దామోదర్‌, టీఎస్‌ కళ్యాణ్‌, వేల్పుల భద్రయ్య, ఇరుకు నాగేశ్వరరావు, మందరపు వెంకయ్య, పద్మావతి, కోలేటి ఉపేందర్‌, పయ్యావుల ప్రభావతి కందుల భాస్కర్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love