నూతన పోలీస్ కమీషనర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన రెడ్ క్రాస్ బృందం 

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
రెడ్ క్రాస్ నిజామాబాదు జిల్లా శాఖ వారు కొత్త పోలీస్ కమీషనర్ సాయి చైతన్య ని రెడ్ క్రాస్ చైర్మన్ బుస్స ఆంజనేయులు ఆధ్వర్యంలో కలసి శుభాకాంక్షలు బుధవారం తెలియజేశారు. రెడ్ క్రాస్ చేపడుతున్న సేవ కార్యక్రమాలు రెడ్ క్రాస్ సభ్యులు సిపికి వివరించారు. అందుకు గాను కమిషనర్ కూడా తలసేమియా పిల్లల కోసం త్వరలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేద్దాం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్, కార్యదర్శి గోక అరుణ్ బాబు, నిజామాబాదు డివిజన్ చైర్మన్ డా.శ్రీశైలం, డా రాజేశ్వర్, పి.ఆర్.ఓ బొద్దుల రామకృష్ణ పాల్గొన్నారు.
Spread the love