పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరనీయం : ఎస్పీ

నవతెలంగాణ-కొత్తగూడెం
దేశరక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరనీయమని ఎస్పీ డాక్టర్‌.వినీత్‌.జి అన్నారు. పోలీస్‌ అమరవీరుల సంస్కరణ కార్యక్రమాలలో భాగంగా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో శనివారం కొత్తగూడెం త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆన్లైన్‌ ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎస్పీ ప్రాభించి, మాట్లాడారు. పోలీస్‌ శాఖ ద్వారా ప్రజలకు సేవ చేయడం గర్వకారణ మన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్‌, కొత్తగూడెం త్రీ టౌన్‌ సిఐ మురళి, 1 టౌన్‌ సిఐ కరుణాకర్‌, అడ్మిన్‌ ఆర్‌ఐ రవి, ఎంటిఓ సుధాకర్‌, వెల్ఫేర్‌ ఆర్‌ఐ కృష్ణారావు, ఆర్‌ఐ నాగేశ్వరరావు, ఐటి కోర్‌ ఇంచార్జి సిఐ సతీష్‌, ట్రాఫిక్‌ ఎస్సై నరేష్‌, ఏఆర్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love