గాలన్న ఉద్యమ సేవలు నేటికీ ప్రజల గుండెల్లో సజీవం

నవతెలంగాణ –  శంకరపట్నం
విద్యార్థి దశ నుండే బొడిగె గాలన్న ఉద్యమ సేవలు ప్రజల గుండెల్లో నేటికీ చీరస్మయనియంగా ఉన్నాయని శంకరపట్నం మండలం పరిషత్ ఉపాధ్యక్షులు పులికోట రమేష్ కొనియాడారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమకారురాలు బొడిగె శోభక్క భర్త బొడిగె గాలన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా,  సోమవారం శంకరపట్నం మండలం ప్రజా ప్రతినిధులు గాలన్నా స్వగ్రామమైన సైదాపూర్ మండలం వెంకటేశ్వరపల్లె లో మాజీ ఎమ్మెల్యే శోభక్కను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అనంతరం  గాలన్న చిత్రపటానికి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ రమేష్ మాట్లాడుతూ, గాలి అన్న ఉద్యమ దశ నుండి విద్యార్థులకు అండగా ఉండి, పీడిత ప్రజలకు ఎనలేని సేవలు చేశారని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో శోభక్క గాలన్న  దంపతులు ఉద్యమంలో చురుగ్గా పాల్గొని తెలంగాణ ప్రజలను చైతన్యపరిచారని  అన్నారు. గాలన్న సేవలు నేటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని గాలన్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాచాపూర్ సర్పంచ్ కోండ్ర రాజయ్య, కల్వల సర్పంచ్ దాసారపు భద్రయ్య, హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చౌడ మల్ల  వీరస్వామి, సీనియర్ పాత్రికేయుడు గాజుల స్వామి తదితరులు పాల్గొన్నారు.
Spread the love