నౌక ఢీకొని కుప్పకూలిన బ్రిడ్జ్‌.. 20 మంది గల్లంతు

నవతెలంగాణ హైదరాబాద్: అమెరికా(AMERICA)లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. నౌక ఢీకొనడం(Ship Collision)తో బాల్టిమోర్ నగరంలో బ్రిడ్జ్‌ కూలిపోయింది. ‘నౌక ఢీకొనడంతో ఫ్రాన్సిస్‌ స్కాట్ కీ బ్రిడ్జ్‌ కూలిపోయింది’ అని మేరీలాండ్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ ఎక్స్‌ (ట్విటర్‌)లో  తెలిపింది. దీంతో పటాప్‌స్కో నది మీదుగా రాకపోకలు సాధ్యం కాదని డ్రైవర్లకు సూచించింది. ఈ ప్రమాదంలో వంతెనపై ఉన్న పలు వాహనాలు నదిలో పడిపోయినట్టు తెలుస్తోంది. దాదాపు 20 మంది గల్లంతయ్యారని సమాచారం. స్థానిక కాలమానం ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీస్థాయి కంటైనర్ షిప్ ఈ వంతెనను ఢీకొట్టింది. దీంతో అది పేకమేడలా కూలిపోయిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఆ సమయంలో వారధి(US Bridge) మీద ఉన్న పదుల సంఖ్యలో కార్లు నదిలో పడిపోయినట్టు సమాచారం. చైనాలో గత నెల ఇదే తరహా ఘటన జరిగింది. గ్వాంగ్జూ నగరంలోని పెరల్‌ నదిపై ఉన్న లిజింగ్షా వంతెనను ఓ నౌక బలంగా ఢీకొంది.

Spread the love