– ఆయిల్‌ఫామ్ సాగు సమీక్షలో కలెక్టర్ పీ.ప్రావీణ్య
నవతెలంగాణ-వరంగల్
సెప్టెంబర్ చివరులోగా అయిల్ ఫామ్ సాగు లక్ష్యాలు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ పి.ప్రావీ ణ్య ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో ఆయిల్ ఫామ్ తోటల సాగు, పెంపకంపై వ్యవసా యశాఖ అధికారి ఉషాదయాళ్, ఉద్యానవన శాఖ అధికారి శ్రీ నివాస్‌రావు, ఫామ్‌ఆయిల్ కంపెనీకి సంబంధించిన క్షేత్ర స్థాయి అధికారులు, డ్రిప్ కంపెనీలకు సంబంధించిన అన్ని కంపెనీలతో జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య సమీక్షా సమావేశం ని ర్వహించారు. ఈ సమీక్ష లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సె ప్టెంబర్ నెలాఖరులోగా లక్ష్యాలు పూర్తి చేయాలని, అయి ల్ ఫామ్ తోటల విస్త్రీర్ణం ఏ మేరకు పెంచారు. బిందుసేద్యం ఎంతవరకు జరిగిందనే అంశాలపై జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయి అధికారులను వారి వారి లక్ష్యాలు, సాధించిన ప్రగతిని అడి గి తెలుసుకున్నారు. ఎక్కడైతే అనుకున్న లక్ష్యాలు సాధించ లే క పోవుటకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సంవత్సరం జిల్లాకు సంబంధించిన నిర్దేశిత లక్ష్యం 10 వేల ఎకరాలకుగాను ఈ మూడు నెలల్లో దాదాపు 2007 ఎకరా లకు పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ 2007 ఎకరాల్లో ఇప్పటివరకు1250 ఎకరాల్లో ఫామాయిల్ తోటలను నాటడం జరిగిందని జిల్లా ఉద్యాన వన శాఖ అది కారి జిల్లా కలెక్టర్‌కు తెలిపారు. మిగిలి పోయిన 750 ఎక రాల్లో రెండు, మూడు రోజుల్లో ప్లాంటేషన్ చేయించాలని అ న్నిమండలాల వ్యవసాయ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదే శించారు. సెప్టెంబర్ నెలాఖరు వరకు చేయవలసిన లక్ష్యం 2800 ఎకరాలకు గాను మిగిలి ఉన్న 800 ఎకరాలకు కొత్తగా రైతులను ఎంపిక చేసి వారి నుండి దరఖాస్తులు స్వీ కరించి రైతువాటా డిడి కట్టించాలని అన్నారు. డ్రిప్ ఇరిగే షన్‌కి సంబంధించి దరఖాస్తుల ను స్వీకరించు మొత్తం ప్ర క్రియను ఈనెల చివరికల్ల పూర్తి చేయాలి బిందుసేద్య కం పెనీలను ఆదేశించారు. నెలాఖరు వరకు 2800 ఎకరాల లక్ష్యాన్ని పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వచ్చే వారంలో ప్లాంటేషన్ ప్రోగ్రాం పూర్తి అవ్వాలని, రాబోయే రెండు మూడు వారాలకు సంబందించిన ప్రణాళిక సిద్దం చేసుకుని దానికి అనుగుణంగా కార్యాచరణ చేపట్టాలి అని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా రై తుల అవసరాలను ఉద్దేశించి ఎరువులు ఏమేరకు అందుబా టులో ఉన్నాయి ? యూరియా నిలువల వివరాలు జిల్లా వ్య వసాయశాఖ అధికారి ఉషాదయాళ్‌ను అడిగి తెలుసుకున్నా రు. జిల్లావ్యవసాయ అధికారి ఉషాదయాళ్ జిల్లాలోని యూ రియా వివరాలు జిల్లా కలెక్టర్ గారికి వివరించారు. జిల్లాలో ప్రస్తుతం అన్ని మండలాల్లో యూరియా నిలువల స్టాక్ వివ రాలు తెలంగాణ మార్క్ ఫెడ్,డీలర్స్, కంపెనీ వేర్‌హౌజ్, హోల్స్‌సేల్స్ డీలర్స్ వద్ద మొత్తం 9407 మెట్రిక్ టన్నులు యూరియా నిలువలు ఉన్నాయని, మండలాల వారిగా 5160 మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో ఉన్నదని జిల్లా కలెక్టర్ అన్నారు. రైతులకు ఎరువులు అందు బాటులో ఉండేలా చూడాలని సంబంధిత అధికారులను ఆ దేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ క్షేత్ర స్థాయి అధికారులు, ఉద్యానవన శాఖ అధికారులు, రామ్ చరణ్ ఆ యిల్ ఫామ్ ఇండిస్టీ జనరల్ మేనేజర్ సతీష్,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.