Tuesday, June 16, 2026
E-PAPER
Homeజిల్లాలుయూరియా యాప్ ను రద్దు చేయాలి

యూరియా యాప్ ను రద్దు చేయాలి

- Advertisement -

సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు
నవతెలంగాణ – నాగర్ కర్నూల్
యూరియా యాప్ ను రద్దు చేసి, రైతులకు సరిపడా యూరియాను అందించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్ధన్ పర్వతాలు డిమాండ్ చేశారు. మంగళవారం సీపీఐ(ఎం) కల్వకుర్తి డివిజన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైందని, యూరియా ద్వారా రైతులకు అనేక అవసరాలు ఏర్పడ్డాయని అన్నారు. రైతులకు సరైన యూరియా అందకపోవడంతో దిగుబడి కూడా తగ్గుతుందని అన్నారు. ఇప్పటికి యూరియా అవసరాల కోసం రైతులు లైన్లో నిలబడుతున్నారని అన్నారు. విత్తనాల ధరలు ఎరువుల ధరలు పెంచారని, దీంతో రైతులకు సాగుకు విపరీతమైన భారం పడుతుందని అన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ అధికారులు ఫర్టిలైజర్ షాపులను తనిఖీలు చేయాలని, నకిలీ విత్తనాల అమ్ముతున్న షాపులపై పీడి యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి ఆంజనేయులు, సి ఆంజనేయులు పరశురాములు సిద్దయ్య బక్కయ్య, జగన్ రామా అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -