ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యంతో అడవుల పెంపకాన్ని వ్యతిరేకించండి
ఉపాధి కూలీల పొట్ట కొట్టే విబిజి రాంజీ చట్టం రద్దు చేయాలి
ఆరు గ్యారెంటీ ల అమలు కోసం పోరాటాలను ఉధృతం చేస్తాం
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు B. ప్రసాద్ పిలుపు
నవతెలంగాణ – హైదరాబాద్:
కార్పోరేట్ బహుళ జాతి కంపెనీలకు అటవీ భూములను అప్పగించడం కోసమే ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యంతో అడవుల పెంపకం విధానాన్ని మోడీ ప్రభుత్వం ముందుకు తెచ్చిందని, దీని ముసుగులో ఆదాని అంబానీ లకు అటువై భూములు అప్పజెప్పాలనే కుట్రలను తిప్పి కొట్టడం కోసం ఆదివాసి గిరిజనలు వ్యవసాయ కార్మికులు సిద్ధం కావాలని, పోడు సాగు దారులందరికీ హక్కు పత్రాలు వచ్చేవరకు రాష్ట్రవ్యాప్తమైన పోరాటాలను ఉదృతం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్ పిలుపునిచ్చారు.
అసిఫాబాద్ టౌన్ లో రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మొదటి మహాసభకు ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన మాట్లాడుతూ పోడు, సాగు దారుల మీద కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. 2006 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయకుండా సాగు భూముల నుండి గిరిజన పేద రైతాంగాన్ని బేధాకల్ చేసే ఫారెస్ట్ అధికారుల నిర్బంధ చర్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వామపక్షాలు పోరాట ఫలితంగా వచ్చిన గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి కూలీల పొట్ట కొట్టే విబిజీ రాంజీ చట్టాన్ని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిందని, 125 రోజులు పని దినాలను పెంచుతున్నట్లు ప్రకటించి పెరిగిన పని దినాల కనుగుణంగా బడ్జెట్లో నిధులు కేటాయించకుండా మీరు ఎంతో కష్టపడి కేవలం 60 శాతం మాత్రమే ఇస్తామనడం పని కల్పించే బాధ్యతనుండి కేంద్ర ప్రభుత్వం తప్పు కోవడమే అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వాలు 40% నిధులు ఇవ్వాలని వ్యవసాయ సీతనలో 60 రోజులు పని దినాలు బ్లాక్ చేయాలని, ఉదయం సాయంత్రం కూలీల ఫోటోలు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని, మేడం పనిని ఎత్తివేసే కుట్రలో భాగమే అన్నారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పాత ఉపాధ్యామి చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెరిగే ధరలు కనుగుణంగా కనీస వేతనాలను ఎనిమిది వందలకు పెంచాలని పట్టణ పేదలకు ఉపాధి పని పెట్టాలని, పని దినాలు 200 రోజులకు పెంచాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడం లేదని అన్నారు. లక్షల రూపాయలు ఇస్తామన్న వాగ్దానం ఎస్సీ, ఎస్టీలకు అదనంగా లక్ష రూపాయలు కలిపి ఆరు లక్షలు ఇస్తామని చెప్పిన మాట, భూమిలేని పేదలకు రూ.12000, మహిళలకు రూ.2500 నిరుద్యోగ యువతకు ఐదు లక్షలు రూ..500 గ్యాస్ సబ్సిడీ, కౌలు రైతులకు రూ.15000, తులం బంగారం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ రైతు భరోసా, వంటివి నేటికి అమలు కాలేదని చెప్పారు.
ఈ మహాసభలో సురేష్ రాజేందర్, ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కోటా శ్రీనివాస్, మహిళా సంఘం నాయకురాలు షాహిన్, మమత, రానా, వినోద తదితరులు పాల్గొన్నారు.



