ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే..!

నవతెలంగాణ-హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ భేటీ ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ సచివాలయంలో సమావేశమైన మంత్రి మండలి.. దాదాపు మూడున్నర గంటల పాటు వివిధ అంశాలపై చర్చించింది. ఇటీవల ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ఈ భేటీలో మంత్రి మండలి ప్రధానంగా చర్చించింది. ఈ భేటీలో క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చంద్రబాబు సంతకం చేసిన మొదటి ఐదు ఫైళ్లకు తాజాగా క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెగా డీఎస్సీ, ఆసరా పెన్షన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్ సెన్సెస్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు మంత్రి మండలి పచ్చ జెండా ఊపింది. క్యాబినెట్ భేటీ ముగిసిన అనంతరం కూడా చంద్రబాబు మంత్రులతో సమావేశం అయ్యారు. శాఖల వారీగా ముందుకు ఎలా వెళ్లాలనేదానిపై మంత్రులకు సూచించారు. శాఖల వారీగా శ్వేతపత్రాల విడుదలపై మంత్రులకు సీబీఎన్ పలు సూచనలు చేశారు. తమకు కేటాయించిన శాఖలపై అధికారులతో సమన్వయం చేసుకుంటూ పట్టు సాధించాలని దిశానిర్దేశం చేశారు.

Spread the love