ఆగస్టు 10న జైల్‌భరో : జయప్రదానికి సీఐటీయూ పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని పరిశ్రమల్లో పర్మినెంట్ కార్మికులతో సమానంగా పనిచేస్తున్న నాన్ పర్మినెంట్ (అప్రెంటీస్, న్యాప్స్, న్యాట్స్) కార్మికులకు సమాన పనికి సమాన వేతనాలను చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఆ సంఘం కార్యాలయంలో తెలంగాణ స్టేట్ ఫిక్స్డ్ టర్మ్ అండ్ నాన్ రెగ్యులర్ ఎంప్లాయిస్ యూనియన్ సమావేశాన్ని రాష్ట్ర అధ్యక్షులు జె మల్లిఖార్జున్ అధ్యక్షతన నిర్వహిం చారు. ఈ సందర్బంగా రాములు, భాస్కర్ మాట్లాడుతూ లేబర్ కోడ్‌లలో భాగంగా పర్మినెంట్ కార్మికుల స్థానంలో ఫిక్స్డ్ టర్మ్, కాంట్రాక్ట్, అప్రెంటీస్, న్యాప్స్, న్యాట్స్ తదితర పేర్లతో పని చేయించుకుంటున్నారని తెలిపారు. పర్మినెంట్ కార్మికులతో సమానంగా వీరు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. వీరికి తక్కువ వేతనాలు ఇస్తున్నారని, చట్టప్రకారం రావాల్సిన సౌకర్యాలు కల్పించటం లేదని, ఎక్కువ పని గంటలు చేయించుకుంటున్నారని, ఇవ్వాల్సిన సెలవులు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రకంగా వారు శ్రమ దోపిడీకి గురవుతున్నారని తెలిపారు. పరిశ్రమల్లో 17శాతం పర్మినెంట్ కార్మికులు ఉంటే 83శాతం కాంట్రాక్ట్, క్యాజువల్, ఫిక్స్డ్ టర్మ్, అప్రెంటీస్, న్యాప్స్, న్యాట్స్, అనేక పేర్లతో పని చేయించుకుంటూ ఇబ్బందులకు గురిచేస్తు న్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవైపు కార్మికవర్గం, ప్రజల్లో వస్తున్న అసంతృప్తిని పోరాటాలవైపుకు పోకుండా కేంద్ర ప్రభుత్వం మతపరమైన చీలికలు తీసుకొస్తు న్నదని చెప్పారు. ఎన్నికల సమయంలో భావోద్వే గాలను రెచ్చగొట్టి ఓట్లల్లో లబ్ది పొందుతు న్నారని విమర్శించారు. పెరిగిన నిత్యవసర ధరల తో చాలీచాలని వేతనాలతో కుటుం బాలను పోషించుకోలేక సరైన విద్య, వైద్యం అందక కార్మికులు అనేక ఇబ్బందులు పడుతు న్నారని తెలిపారు. ఈ స్థితిలో నాన్ రెగ్యులర్ ఎంప్లాయిస్ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం ఒక్కటే మార్గమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను అవలం భిస్తున్న నేపథ్యంలో ఆగస్టు 10న క్విట్ ఇండియా ఉద్యమస్ఫూర్తితో జైల్ భరో కార్య క్రమాన్ని చేపట్టబోతున్నామని వివరించారు. సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల సంయుక్త పిలుపులో భాగంగా చేపడుతున్న ఈ కార్య క్రమంలో తెలంగాణ ఫిక్స్ టర్మ్ అండ్ నాన్ రెగ్యులర్ ఎంప్లాయిస్ కూడా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో యూని యన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్ కోశాధికారి ఎల్ సింధు, పాల్గొన్నారు.
పర్మినెంట్ కార్మికులతో సమానంగా వేతనాలివ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


