Homeమానవిప్రతి ఒక్కరూ చేయాల్సినవి....

ప్రతి ఒక్కరూ చేయాల్సినవి….

- Advertisement -

వర్కౌట్ ఆరోగ్యానికి చాలా మంచిది. నిజానికీ.. వర్కౌట్స్‌లో ఏరోబిక్స్, స్ట్రెచింగ్, స్ట్రెంథనింగ్, బ్యాలెన్స్ వర్కౌట్స్‌తో చాలా లాభాలున్నాయి. వీటిని చేయడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకోండి.

స్ట్రెచింగ్..
స్ట్రెచింగ్ చేయడం వల్ల ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. దీంతో కండరాల తిమ్మిర్లు, నొప్పులు, కీళ్ళనొప్పుల సమస్య తగ్గుతుంది. అందుకోసం వారానికి మూడు, నాలుగుసార్లు చేయొచ్చు.

స్ట్రెంథ్ ట్రైనింగ్..
స్ట్రెంథ్ ట్రైనింగ్ చేయడం వల్ల మజిల్ మాస్ పెరుగుతుంది. దీంతో రోజువారీ పనులు, బరువులు ఎత్తడం వంటివి ఈజీగా చేయొచ్చు. దీని వల్ల కండరాలు బలంగా మారతాయి. ఎముకల బలం పెరుగుతుంది. బ్లడ్ షుగర్, బరువు తగ్గుతుంది. బ్యాలెన్సింగ్ ఏర్పడి మన పోశ్చర్ మెరుగ్గా ఉంటుంది. కీళ్ళలో ఒత్తిడి, నొప్పి తగ్గుతుంది.

ఏరోబిక్స్..
ఏరోబిక్స్ చేయడం వల్ల హార్ట్ బీట్ రేట్, బ్రీతింగ్‌ స్పీడ్ పెరుగుతుంది. ఇది మన బాడీలో చాలా పనులకు సహాయ పడుతుంది. అంతేకాకుండా, గుండె, ఊపిరితిత్తులకి మంచి ఎక్సర్‌సైజ్‌లా పనిచేస్తుంది. మనలో ఓర్పుని పెంచుతుంది. అంతేకాకుండ ఇది గుండె, ఊపిరితిత్తులు బాగా పనిచేసేలా కండరాలకి తగినంత రక్తాన్ని అందించే వర్కౌట్. ఏరోబిక్స్ చేయడం వల్ల రక్తనాళాల గోడలు సడలించడం, రక్తపోటు తగ్గడం, రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం, మంటను తగ్గించి మానసిక స్థితిని పెంచుతుంది. బరువు తగ్గించడంతో పాటు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. దీంతో పాటు గుండెజబ్బులు, స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్, బ్రెస్ట్, కోలన్ క్యాన్సర్, డిప్రెషన్ వంటి సమస్యల్ని తగ్గిస్తుంది. కాబట్టి, వారానికి కనీసం 150 నిమిషాలు మితమైన తీవ్రతతో కూడిన వర్కౌట్ చేయండి. స్పీడ్‌గా నడవడం, స్విమ్మింగ్, జాగింగ్, సైక్లింగ్, డ్యాన్స్, స్టెప్ ఏరోబిక్స్ వంటి ఎక్సర్‌సైజెస్‌ని చేయండి.

బ్యాలెన్స్ ఎక్సర్‌సైజెస్..
మన బాడీలో బ్యాలెన్సింగ్ పెంచడంలో ఈ వర్కౌట్స్ హెల్ప్ చేస్తాయి. మన వయసు పెరిగేకొద్దీ మనలో బ్యాలెన్సింగ్ తగ్గుతుంది. ఈ బ్యాలెన్సింగ్ వర్కౌట్స్ చేయడం వల్ల బ్యాలెన్సింగ్ పెరుగుతుంది. అదే విధంగా, వయసు పెరిగే కొద్దీ వచ్చే కంటి సమస్యలు, వినికిడి సమస్యలు, కీళ్ళ సమస్యలన్నింటినీ ఈ వర్కౌట్స్‌తో రివర్స్ చేయొచ్చు. సాధారణంగా బ్యాలెన్స్ వర్కౌట్స్ మీ కళ్ళు తెరిచి, మూసుకుని కొద్దిసేపు ఒక కాలిపై నిలబడడం, మడమ నుండి కాలి వరకూ నడవడం వంటివి చేయొచ్చు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -