ఆలోచించి ఓటు వేయాలి..

– బీఎస్పీ అభ్యర్థి చక్రధర్ గౌడ్
నవతెలంగాణ – సిద్దిపేట
ఈ నెల 30న జరిగే ఎన్నికలలో ప్రజలందరూ ఆలోచించి ఓటు వేయాలని, నియోజకవర్గంలోని ప్రతి వర్గానికి తాను ఆదుకోవడానికి పథకాలను రూపకల్పన చేసినట్లు బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి చక్రధర్ గౌడ్ తెలిపారు. ఏనుగు గుర్తుకే ఓటేయాలంటూ నియోజకవర్గం లోని పలు గ్రామాలలో,  పట్టణంలో ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట వాసులు రాజకీయ చైతన్యం కలవారని , బాగా అలోచించి వోట్ వేస్తారని తెలిపారు. అదే చైతన్యం తో ఈసారి ఏనుగు గుర్తుకే ఓటు వేసి , రైతు పక్షపాతిని అయిన నన్ను భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు.  గౌడ భీమా తరహాలో అన్ని కులాలకు ఆరోగ్య భీమా కల్పిస్తానని హామీ ఇచ్చారు.  దొరకు ఊడిగం చేసి చేసి మీరంతా అలసిపోయారని,  యువత భవిష్యత్ గురించి ఆలోచించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఎస్పి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love