- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తమిళనాడులో ఓ చిన్నారిపై జరిగిన లైంగికదాడి ఘటనపై టివికే అధినేత, సీఎం విజయ్ స్పందించారు. ఘోరమైన నేరాలకు పాల్పడేవారికి చట్టం ద్వారా కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళలు, పిల్లలపై జరుగుతున్న నేరాలపై త్వరగా విచారణ పూర్తి చేసి, కారకులకు శిక్ష పడేలా చేయాలని తెలిపారు. నిందితులకు విధించే కఠిన శిక్షలు భవిష్యత్తులో నేరాలకు పాల్పడాలనుకునే వారికి హెచ్చరికలా, గుణపాఠంలా ఉండాలని పేర్కొన్నారు.
- Advertisement -



