జెరూసలెంలో ఉగ్రదాడి… ముగ్గురు మృతి

నవతెలంగాణ హైదరాబాద్:  జెరూసలెంలో నేటి ఉదయం ఉగ్రదాడి చోటుచేసుకొంది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.  ఉదయం 7.40 గంటలకు కారులో వచ్చిన ఇద్దరు పాలస్తీనా సాయుధులు జెరూసలెంలోని వైజ్‌మన్‌ స్ట్రీట్‌లో ఓ బస్టాప్‌లో నిలిచిన ప్రజలపై కాల్పులు జరిపారు.  ఈ దాడి జరుగుతున్న సమయంలో.. విధులు ముగించుకొని వెళుతున్న ఇద్దరు సైనికులు, ఆయుధం ఉన్న ఓ పౌరుడు ఈ ఉగ్రవాదులపై ఎదురుదాడికి దిగారు. ఈ ఘటనలో ఆ ఇద్దరు ఉగ్రవాదులు కూడా మరణించారు. వీరిద్దరిని తూర్పు జెరూసలెంకు చెందిన మురాద్‌ నమార్‌, ఇబ్రహీం నమార్‌గా గుర్తించారు. వీరి నుంచి ఎం-16 రైఫిల్‌, హ్యాండ్‌ గన్‌ స్వాధీనం చేసుకోగా.. వాహనంలో భారీగా మందుగుండు సామగ్రి ఉన్నట్లు గుర్తించారు. ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కాల్పుల విరమణను పొడిగించిన వేళ ఈ ఘటన చోటుచేసుకుంది.

Spread the love