రంగారెడ్డి జిల్లాలో ఘోరం..ముక్కలు ముక్కలుగా ఎగిరి పడ్డ శరీర భాగాలు

నవతెలంగాణ-హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. స్థానిక సౌత్‌ గ్లాసు ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో కంప్రెషర్‌ పేలడంతో ఆరుగురు మృతి చెందారు. ఈ పేలుడుతో పరిశ్రమ వద్ద భీతావహ వాతావరణం నెలకొంది. గాజు పరిశ్రమ కావడంతో కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. ఈ ఘటనలో 15మందికి మందికి గాయాలు కాగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలు అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ఒకేసారి కంప్రెషర్‌ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఈ దుర్ఘటన ఎలా జరిగిందనే దానిపై ఇంకా ఆరా తీస్తున్నారు. మృతులు ఒడిశా, బిహార్‌, యూపీ వాసులుగా గుర్తించారు. తీవ్ర గాయాలైనవారిని మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా, గాంధీ ఆస్పత్రికి తరలించే అవకాశం ఉంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతంలో ఇక్కడ ఇలాంటి ఘటన జరిగినప్పుడే కార్మికుల భద్రత దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలని ఇచ్చిన సూచనల్ని ఏ మేరకు పాటించారనే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Spread the love