భారత షిప్పింగ్ డైరెక్టర్ జనరల్ వెల్లడి
న్యూఢిల్లీ : ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడి అనంతరం పశ్చిమాసియాలో చోటుచేసుకున్న ఘర్షణల్లో ఇప్పటి వరకు భారత్‌కు చెందిన ముగ్గురు నావికులు మరణించారు. ఈ మేరకు భారత షిప్పింగ్ డైరెక్టర్ జనరల్ శ్యామ్ జగన్నాథన్ ఒక ప్రకటన జారీ చేశారు. ఒమన్ తీర ప్రాంతాల్లో ఉన్న పలు వాణిజ్య నౌకలపై ఇరాన్ చేసిన దాడుల్లో ముగ్గురు భారతీయులు మరణించారని, మరొకరు తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో షిప్ ఆపరేటర్లకు అడ్వైజరీ జారీ చేసింది. గల్ఫ్ ఆఫ్ ఒమన్, హోర్ముజ్ జలసంధి, పర్షియన్ గల్ఫ్‌లో పరిస్థితులను గమనిస్తున్నామని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో క్షిపణి, డ్రోన్ కార్యకలాపాలకు సమస్యలు ఉన్నట్లు గుర్తించామని, షిప్ ఆపరేటర్ల భద్రతను కచ్చితంగా దృష్టిలో ఉంచుకోవాలని.. అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే నివేదించాలని సూచించారు. తాజా నివేదికల ప్రకారం.. భారత జెండా ఉన్న నౌకలను బంధించినట్లు ఎటువంటి సమాచారం రాలేదని శ్యామ్ జగన్నాథన్ పేర్కొన్నారు.
ముగ్గురు నావికులు మృతి
- Advertisement -
- Advertisement -



