హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భారీ ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతున్నాయి. ఏప్రిల్ 18వ తేది  గురువారం సాయంత్రం హైదరాబాద్ నగర శివార్లలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ఉప్పల్, చిలుకానగర్, మల్లాపూర్, నాచారం, చెంగిచెర్ల, కీసర, కొంపల్లి, చర్లప్లల్లి, కాప్రా, కుషాయిగూడ, జవహర్ నగర్, నేరేడుమెట్, ఈసీఐఎల్ ప్రాంతాల్లో  వర్షం కురిసింది. నగరంలోని మిగతా ప్రాంతాల్లో కూడా వర్షం పడే అవకాశం ఉంది. దీంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వాతావరణ శాఖ తెలిపింది.

Spread the love