కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్య వరకు పటిష్ట భద్రత:  ఎస్పీ చందన దీప్తి

నవతెలంగాణ-  నల్గొండ కలెక్టరేట్ 
ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ యం.ఎల్.సి పట్టభద్రుల ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠ భద్రతా కొనసాగుతోంది  జిల్లా ఎస్పి చందనా దీప్తి స్పష్టం చేశారు. శుక్రవారంసాయంత్రం కౌంటింగ్ హాల్ ప్రాంతంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.విజయోత్సవ ర్యాలీలకు అనుమతి తప్పనిసరి తీసుకోవాలని అన్నారు.ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి  చట్ట విరుద్ధమైన చర్యలకు పాల్పడితే  ఆర్.పి ఆక్ట్  ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎలక్షన్ గైడ్ లైన్స్ ప్రకారం కేసు అయిన వారు భవిష్యత్ లో పోలింగ్ ఏజెంట్లుగా అనర్హులు గా పరిగణించబడతారని అన్నారు. ప్రతి ఒక్కరూ ఎలక్షన్ నిబంధనలకు కట్టుబడి కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరారు.
Spread the love