Sunday, April 26, 2026
E-PAPER
Homeజాతీయంపశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ అరాచకం : రాహుల్ గాంధీ

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ అరాచకం : రాహుల్ గాంధీ

- Advertisement -

నవతెలంగాణ – న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ గూండాలు ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దేబ్దీప్ ఛటర్జీని దారుణంగా హతమర్చారు. ఈ హత్యా ఘటనను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆదివారం త్రీవంగా ఖండించారు. ఈ సందర్భంగా భారతదేశ అహింసా సంప్రదాయాన్ని మలినం చేసే ఈ రాజకీయాలకు తమ పార్టీ తలొగ్గదని ఆయన అన్నారు. దేబ్దీప్ మరణంతో త్రీవ దు:ఖంలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులకు రాహుల్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా రాహుల్ ‘నేడు పశ్చిమ బెంగాల్ లో ఉన్నది ప్రజాస్వామ్యం కాదు. ఇప్పటికీ టిఎంసి భయోత్పాత పాలన కొనసాగుతోంది. ఓట్లు వేసిన తర్వాత బెదిరించడం, దాడి చేయడం, ప్రతిపక్షాల గొంతును నొక్కేయడం ఇదే టిఎంసికి ప్రధాన లక్షణంగా మారింది అని రాహుల్ ఎక్స్ పోస్టులో త్రీవంగా ఆరోపించారు.

‘మేము కూడా మా కార్మికులను కోల్పోయాము, అయినప్పటికీ మేము ఎల్లప్పుడూ అహింసా మార్గాన్ని, రాజ్యాంగాన్నే ఎంచుకున్నాము. ఇదే మా వారసత్వం, ఇదే మా సంకల్పం. దోషులందరినీ తక్షణమే అరెస్టు చేయాలి` అని రాహుల్ ఎక్స్ పోస్టులో టిఎంసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే దేబ్దీప్ కుటుంబానికి పూర్తి భద్రత, నష్టపరిమారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. భారతదేశ అహింసా సంప్రదాయాన్ని మలినం చేసే ఇలాంటి రాజకీయాలకు మేము తలవంచబోము. న్యాయం జరుగుతుంది అని రాహుల్ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -