దోమలు వృద్ధి చెందకుండా చూసుకోవాలని..

– ఆరోగ్య విస్తరణ అధికారి శంకర్ 
నవతెలంగాణ – డిచ్ పల్లి
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మారుతున్న సీజన్ కాలంలో  మలేరియా ,డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి వ్యాధులు ప్రబలుతాయని, దోమలు వృద్ధి చెందకుండా చూసుకోవాలని మండల ఆరోగ్య విస్తరణ అధికారి వై శంకర్ అన్నారు.ఇందల్ వాయి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం  పరిధిలోని గన్నారం ఆరోగ్య ఉపకేంద్రంలోని స్త్రీ శక్తి భవన్లో జరిగిన సమావేశంలో జాతీయ కీటక జనిత వ్యాధుల నివారణ చర్యల పై మండల ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్ అవగాహన కల్పించారు. ఏడిస్ ఈజిప్టి అనే దోమ వలన డెంగ్యూ వ్యాధి ప్రబలుతుందని, ఈ దోమ పగటిపూట మాత్రమే కుడుతుందని, ఇది మంచి నీటిలో పెరుగుతుందని ప్రజలు తమ ఇంటి చుట్టుపక్కల నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. ఇంట్లోని పూల కుండీలు, వాడి పడేసిన కొబ్బరి చిప్పలు, పాత కూలర్లు, వాటిలో నీరునిలువ ఉన్నట్లయితే నీటిని తొలగించి ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షులు అక్బర్ అలీ, ఐకెపి సిబ్బంది గోవింద్, మమత పాల్గొన్నారు.
Spread the love