పళ్ళు పుచ్చిపోకుండా ఉండాలంటే…

To prevent tooth decay...పళ్ళు పుచ్చిపోతున్నాయా.. ఇందుకు కారణం పళ్ళ మీద బాక్టీరియా ఏర్పడడం… ఈ బాక్టీరియా ప్లేక్‌ అనే పొరని తయారు చేస్తుంది. ఈ పొర పంటి మీద ఎనామిల్‌ లోంచి మినరల్స్‌ని తీసేస్తుంది. దంతాలు బలంగా ఉండడానికి కావాల్సిన కాల్షియం, ఫాస్ఫేట్‌ ఈ ఎనామిల్‌లోనే ఉంటాయి. దీని వల్ల ఎనామిల్‌లో రంధ్రాలు ఏర్పడతాయి. అది నెమ్మదిగా దంత క్షయానికి దారి తీస్తుంది.
కారణాలు :
నోరు ఎండి పోయినట్లుండడం  పళ్ళకి అంటుకు పోయే చాక్లెట్స్‌ లాంటి ఫుడ్స్‌ తినడం  షుగర్‌ ఎక్కువగా ఉన్న ఐస్‌ క్రీంమ్‌, కూల్‌ డ్రింక్స్‌ తినడం  తగినంత విటమిన్‌ డీ లేకపోవడం  అరుగుదల సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చే గుండెల్లో మంట  రోజుకి రెండుసార్లు సరిగ్గా పళ్ళు తోముకోకపోడం
పరిష్కారాలు :
షుగర్‌ ఫ్రీ గమ్‌ : భోజనం తర్వాత షుగర్‌ ఫ్రీ గమ్‌ నమలడం వల్ల ఈ సమస్య రాకుండా కొంత వరకు నివారించవచ్చు. దీని వల్ల నోట్లో లాలాజలం ఎక్కువగా ఊరి, ప్లేక్‌ పీహెచ్‌ని పెంచుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ గమ్‌ ఎనామిల్లో పోయిన మినరల్స్‌ని మళ్ళీ తీసుకొస్తుందంటున్నారు. ఒక సారి పన్ను పుచ్చిపోతే మాత్రం చేసేదేమీ లేదు. అక్కడ వరకు సమస్య వెళ్ళకుండా జాగ్రత్త వహించాలి.
విటమిన్‌ డి ఫుడ్‌ : విటమిన్‌ డి వల్ల ఆహారంలో ఉన్న కాల్షియం, ఫాస్ఫేట్‌ శరీరంలో అబ్జార్బ్‌ చేసుకుంటుంది. విటమిన్‌ డి పాలూ, పాల పదార్ధాల నుంచి లభిస్తుంది. రోజుకి పదిహేను నిమిషాలు సూర్య కాంతిలో గడపడం వల్ల కూడా శరీరానికి డి విటమిన్‌ లభిస్తుంది.
సమస్య రాకుండా : ఒక వేళ పన్ను పుచ్చిపోయి సమస్య తీవ్రంగా ఉందనుకుంటే ఆ పన్నుని తీసేసి పక్క పంటికి సమస్య పాకకుండా చేస్తారు. రోజంతా షుగర్‌ ఉన్న ఫుడ్స్‌ తీసుకోకుండా ఉండడం, రోజుకి రెండు సార్లు సరిగ్గా బ్రష్‌ చేసుకోవడం వల్ల ఈ సమస్య రాకుండా ఎనభై శాతం వరకూ నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఫ్లోరైడ్‌ టూత్‌ పేస్ట్‌ : కావిటీస్‌ ఏర్పడకుండా, ఎనామిల్‌లోని మినరల్స్‌ పోకుండా ఫ్లోరైడ్‌ కాపాడుతుంది. అందుకే ఫ్లోరైడ్‌ ఉన్న టూత్‌ పేస్ట్‌తో బ్రష్‌ చేసుకోవడం మంచిది.
షుగర్‌ తగ్గించటం : షుగర్‌ ఎక్కువగా ఉన్న ఆహారం తగ్గించాలి. ఒక సారి నోట్లోంచి షుగర్‌ లోపలికి వెళ్ళిపోయాక కొంత సేపటికి ఎనామిల్‌ మళ్ళి మినరల్స్‌ని తయారు చేసుకుంటుంది. కానీ, ఎనామిల్‌కి చాన్స్‌ ఇవ్వకుండా మళ్ళి షుగర్‌ ఉన్న ఫుడ్‌ తినడం వల్ల ఈ సమస్య ఎక్కువగా వస్తుంది.
ఆయిల్‌ పుల్లింగ్‌ : కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ ఇరవై నిమిషాల పాటు నోరంతా తిప్పుతూ ఆయిల్‌ పుల్లింగ్‌ చేయాలి. నువ్వుల నూనెతో ఇలా చేస్తే ప్లేక్‌, జింజవైటిస్‌, బాక్టీరియా అన్నీ తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

Spread the love