వియాత్నాం అధ్యక్షుడిగా టో లామ్..

నవతెలంగాణ – వియత్నాం: వియాత్నాం కొత్త అధ్యక్షుడుగా టో లామ్(66) ను ఆ దేశ పార్లమెంట్ బుధవారం ఖరారు చేసింది. అంతకుముందు భద్రతా సంస్థల అధిపతిగా లామ్ ఉన్నారు. లామ్‌ పోలీసు, ఇంటెలిజెన్స్‌ శాఖలను పర్యవేక్షించినప్పుడు దేశంలో ప్రాథమిక హక్కులను యథేచ్ఛగా ఉల్లంఘించారనీ, అంతర్జాతీయ చట్టాలను ధిక్కరించి విదేశాల్లో అపహరణలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి.  దేశాధ్యక్షుడు, స్పీకర్‌తో సహా ఉన్నత స్థాయి నాయకులు అనేకులు పదవులకు రాజీనామా చేశారు. అధ్యక్ష పదవి అలంకారప్రాయమే అయినా దేశంలో అతి ముఖ్యమైన కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి మున్ముందు లామ్‌ నే వరించవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి.

Spread the love