నవతెలంగాణ – బెజ్జంకి
మండల పరిధిలోని తోటపల్లి గ్రామ శివారులోని మోయతుమ్మెద వాగు నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించినట్టు శుక్రవారం ఎస్ఐ క్రిష్ణారెడ్డి తెలిపారు. పట్టుకున్న ఇసుక ట్రాక్టర్ పై కేసు నమోదు చేశామని ఎస్ఐ వెల్లడించారు.