Monday, June 15, 2026
E-PAPER
Homeజిల్లాలుఅక్రమ ఇసుక రవాణా ట్రాక్లర్లు పట్టివేత

అక్రమ ఇసుక రవాణా ట్రాక్లర్లు పట్టివేత

- Advertisement -

నవతెలంగాణ – ఉప్పునుంతల
సోమవారం మధ్యాహ్నం సమయంలో ఉప్పునుంతల మండలం మొల్గర గ్రామం పరిసర ప్రాంతంలో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో పీట్ల కురుమూర్తి (సూరారం గ్రామం, లింగాల మండలం), జంగిటి మధు (ఉల్పర గ్రామం, వంగూరు మండలం) అనే ట్రాక్టర్ డ్రైవర్ కమ్ ఓనర్లపై కేసు నమోదు చేసినట్లు ఉప్పునుంతల మండల ఎస్సై పుట్ట మహేష్ తెలిపారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా సహజ వనరుల అక్రమ రవాణాకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అక్రమ ఇసుక రవాణా సమాచారం తెలిసిన వెంటనే ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -