నవతెలంగాణ – మల్హర్ రావు
మధ్యాహ్న భోజనం మెరుగుకై వల్లెంకుంట స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వంట కార్మికులనుద్దేశించి మండల విద్యాధికారి లక్ష్మణ్ బాబు మాట్లాడారు. వంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, నాణ్యత ప్రమాణాలపై అవగాహన కల్పించారు. కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు టి. సుదర్శనం మాట్లాడుతూ మధ్యాహ్న భోజనములో ఐదు రకాల పదార్థాలపై వివరించారు. ఆయా పదార్థాలు శరీర నిర్మాణములో శక్తిని ఇవ్వడంలో, శరీర ఆరోగ్యాన్ని కాపాడడంలో తోడ్పడుతాయన్నారు. వంట సమయంలో వంట పాత్రల శుభ్రతతో పాటు పాటించవలసిన నియమాలను గురించి వివరిస్తూ మెనూ ప్రకారం వంటలు వండి విద్యార్థులకు సమతులా ఆహారం అందించాలన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో కాంప్లెక్స్ అసిస్టెంట్ సెక్రటరీ ఎల్ రమేష్ నాయక్,ప్రధానోపాధ్యాయులు,వంట కార్మికులు పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజనంపై స్కూల్ కాంప్లెక్స్ లో శిక్షణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



