Monday, June 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండలంలో అట్టహాసంగా ప్రారంభమైన అల్పాహార పథకం

మండలంలో అట్టహాసంగా ప్రారంభమైన అల్పాహార పథకం

- Advertisement -

నవతెలంగాణ-వర్ధన్నపేట
వర్దన్నపేట మండలంలో అన్ని గ్రామాలలో ఆల్పాహార పథకం హట్టహాసంగా ప్రారంభమైంది. ఇల్లంద ,ల్యాబర్తి , కొత్తపల్లి ,కట్ర్యాల, బండవతపురం, పలు గ్రామాల్లో మొత్తం1382 మంది విద్యార్థులకు అల్పాహారాన్ని నూతనంగా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యం, అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన “ముఖ్యమంత్రి అల్పాహార పథకం” (బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రామ్) ఆయా గ్రామాల సర్పంచులు, ప్రధానోపాధ్యాయులు ఘనంగా ప్రారంభించారు. ల్యాబర్ది సర్పంచ్ మన్నూరు శారదా సోము, ఇల్లంద గ్రామంలో బేతి సాంబయ్య , బండవతాపురంలో బత్తిని దశరథం, కట్రాల గ్రామంలో ఎంఈఓ శ్రీధర్ సర్పంచ్ రాయపురం రమ్య, ఆయా గ్రామాల సర్పంచ్ హెచ్ఎం లు ప్రారంభించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ఉప సర్పంచ్ లో వార్డు సభ్యులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -