వ్యాపారులు విత్తన చట్టాలను అమలుపరచాలి..

– వ్యాపారులు విత్తన చట్టాలకు లోబడి విక్రయాలు చేయాలి
– మండల ఇంచార్జి వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
విత్తన వ్యాపారులు తప్పనిసరిగా విత్తన చట్టాలను అమలు పరచాలని మండల ఇంచార్జి  వ్యవసాయ అధికారి మహమ్మద్ అబ్దుల్ మాలిక్  మండల పరిధిలోని విత్తన వ్యాపారులకు సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని పలు విత్తన షాపులలో కమ్మర్ పల్లి ఎస్ఐ రాజశేఖర్ తో కలిసి  ఆకస్మిక  తనిఖీలు చేశారు. ఆయా షాపుల్లో విత్తనాల స్టాక్ రిజిస్టర్ లను పరిశీలించారు.ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ మాట్లాడుతూ విత్తన వ్యాపారస్తులందరూ విత్తన చట్టాలకు లోబడే విత్తనాల విక్రయాలు నిర్వహించాలన్నారు. కొనుగోలుదారులందరికీ తప్పనిసరిగా రసీదులు ఇవ్వాల్సిన బాధ్యత విత్తన వ్యాపారులపై ఉంటుందని సూచించారు. మండల పరిధిలో రైతులకు సరిపడా   విత్తనాలు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. విత్తనాల కృత్రిమ కొరతను నిరోధించడంలో భాగంగా మండల వ్యవసాయ శాఖ అధికారులతో నిరంతరం  విత్తన డీలర్ షాపులలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండలంలోకి నకిలీ విత్తనాలు ప్రవేశించకుండా పోలీసు, వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కమిటీలు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్  ఎం.ఆంజనేయులు, ఎస్ఐ  రాజశేఖర్, మండల పరిధిలోని విత్తన వ్యాపారులు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love