రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు నెం.80 ప్రకారం ఈనెల 5 నుండి 20 వ తేదీ వరకు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ జరుగుతున్నందున మంగళవారం నాడు జిల్లా కలెక్టరేటు కాన్ఫరెన్స్ హాలులో జూనియర్ అసిస్టెంట్ నుండి క్రింది స్థాయి ఉద్యోగుల వరకు 12 శాఖలు జిల్లా విద్యాశాఖ, వ్యవసాయ శాఖ, పంచాయతీరాజ్, సహకార శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, ట్రెజరీ శాఖ, బీసీ సంక్షేమ శాఖ, మార్కెటింగ్, వైద్య ఆరోగ్య శాఖ, పశుసంవర్ధక, గిరిజన సంక్షేమ, రోడ్లు భవనాల శాఖలకు సంబంధించిన ఉద్యోగులకు జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టరు పి బెన్షాలోమ్, జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ కె గంగాధర్ నేతృత్వంలో బదిలీల కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కౌన్సిలింగ్ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి జగన్మోహన్ ప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, జిల్లా గజిటెడ్ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షులు మందడి ఉపేందర్ రెడ్డి, జిల్లా నాన్ గజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు భగత్, జిల్లా నాన్ గజిటెడ్ ఉద్యోగుల సంఘం కార్యదర్శి ఎండి ఖదీర్, ఉద్యోగులు పాల్గొన్నారు.