గిరిజనులు సేవాలాల్ ను స్ఫూర్తిగా తీసుకోవాలి

– రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
గిరిజనుల ఆరాధ్య దైవమైన సంతు సేవాలాల్ మహారాజును గిరిజనులు స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం హుస్నాబాద్ లోని బంజారా భవన్ లో శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 285 జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జయంతి ఉత్సవ కార్యక్రమానికి హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గిరిజనులు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు అండగా ఉంటుందన్నారు. గిరిజనులకు అండగా ఉంటూ అభివృద్ధిలో సహకరిస్తానని తెలిపారు. గిరిజన తండాలకు రావలసిన నిధులను వచ్చేలా కృషి చేస్తూ ప్రతి గిరిజన తండాను అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో బేన్ శలొమ్ , హుస్నాబాద్ ఎంపీపీ లకావత్ మానససుభాష్ , సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య గిరిజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love