ఎయిడ్స్ మహమ్మారితో పోరాడి అసువులు బాసిన వారందరికీ స్మృత్యంజలి

నవతెలంగాణ-కంటేశ్వర్
అంతర్జాతీయ ఎయిడ్స్ కాండిల్ డే ని జిల్లా కేంద్రం లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం లో ఎయిడ్స్ వ్యాధి తో బాధపడుతూ చనిపోయిన వారికి సంఘీభావం తెలుపుతూ కాండిల్ ర్యాలీ ని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుదర్శనం మాట్లాడుతూ. ప్రజల్లో ఎయిడ్స్ పట్ల ఇంకా అవగాహనా పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమం 1983 నుండి కూడా జరుగుతుందని, ఎయిడ్స్ వ్యాధి తో బాధపడుతున్న వారి పట్ల చిన్న చూపు ఉండరాదని తెలిపారు. ఈ ర్యాలీ పట్టణం లోని ప్రధాన కూడలిలగుండా వెళ్తు పి ఓ డి టి టి(PODTT) వరకు కొనసాగింది. ఈ కార్యక్రమం లో ఎయిడ్స్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ సుధాకర్, జిల్లా టిబి హె చ్ ఐ వి సమన్వయ కర్త రవిగౌడ్, జిల్లా ఆరోగ్య విస్తరణ అధికారి గోవర్ధన్, రాజేందర్,ప్రోగ్రాం అసిస్టెంట్ నవీన్,వర్డ్, స్వచ్చంద సంస్థలు చైల్డ్ ఫండ్ ఇండియా, స్నేహసొసైటీ, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love