మామిళ్ళ రంగా మృతికి నున్నా నాగేశ్వరరావు నివాళులు 

నవతెలంగాణ-వైరాటౌన్:
సీపీఐ(ఎం) సానుభూతిపరులు మామిళ్ళ రంగా (హోటల్ రంగా) అక్టోబర్ 21వ తేదీన ఆనారోగ్యంతో మరణించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పాత సీపీఐ(ఎం) పార్టీ  కార్యాలయంలోని ఒక గదిలో  మామిళ్ళ  రంగా చిన్న టి స్టాల్ పెట్టుకుని జీవనం సాగిస్తూ హోటల్ రంగా గా పేరు తెచ్చుకున్నారు. రంగా భార్య సుగుణమ్మ సీపీఐ(ఎం) పార్టీకి వీర అబిమాని. రంగా కుటుంబ సభ్యులు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. గురువారం వైరా సీపీఐ(ఎం) కార్యాలయం బోడేపుడి వెంకటేశ్వరరావు భవనం నందు అమరజీవి మామిళ్ళ రంగా దశ దిన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భుక్యా వీరభద్రం, బొంతు రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, తాళ్ళపల్లి కృష్ణ మామిళ్ళ రంగా చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు. వీరితో పాటు సీపీఐ(ఎం) వైరా, కొణిజర్ల మండలం కార్యదర్శులు తోట నాగేశ్వరరావు, చెరుకుమల్లి కుటుంబరావు, మండల కార్యదర్శివర్గ సభ్యులు బొంతు సమత, భుక్యా విజయ బాజోజు రమణ, గుడిమెట్ల మోహన్ రావు, గుమ్మా నరసింహారావు, అన్నారపు వెంకటేశ్వరరావు, తోట కృష్ణవేణి, తాల్లూరి నాగేశ్వరరావు, ఓర్పు సీతారాములు, బొట్ల సైదులు, రంగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు నివాళులు అర్పించారు.
Spread the love