శ్రీముఖ్యనాథ దేవాలయముగా ప్రసిద్ధి కేక్కనున్న త్రిపుటాలయం

నవతెలంగాణ – ధర్మసాగర్
కాకతీయ రాజు గణపతి దేవులు 11శతాబ్దంలో ముప్పారం గ్రామంలోని ప్రకృతి ఒడిలో నిర్మించి శివుడు ప్రధాన దేవుడుగా ప్రతిష్టించిన త్రికూటలయం అతి ప్రాచీనమైన శ్రీ ముఖ్యనాథస్వామి దేవాలయంగా ప్రసిద్ధ కేక్కనుంది. కాకతీయుల సామ్రాజ్యంలో అంగరంగా వైభోపేతంగా పూజలతో దేదీప్యమానంగా వెలిగిన దేవాలయం వారి కాలాంతరం దాడికి గురై కొన్ని వందల యేండ్లుగా పూజలు లేక శిధిలావస్థకు చేరింది. గత  మూడు సంవత్సరాల క్రితం మండలంలోని ముప్పారం గ్రామానికి  చెందిన శివసాని ప్రవీణ్ రవీంద్ర అనే భక్తునికి తెల్లవారు జామున శివుడు కలలోకి వచ్చి ముఖ్యనాథస్వామి ఆలయంలో తిరిగి పూజలు జరిగే విధంగా చూడాలని చెప్పడం జరుగుతుంది. ఈ క్రమంలో వారి నేపథ్యంలో 04అక్టోబర్2021మాసశివరాత్రి రోజున మొదటగా కొందరు  భక్తులను తీసుకెళ్ళి పూజలు చేయడం ప్రారంభించారు. అప్పటి నుండి గ్రామస్థులు కొద్దికొద్దిగా ఆలయంకు రావడం మొదలు పెట్టారు. అనంతరం కార్తీక మాసంలో పురాతనమైన విఘ్నేశ్వర స్వామి విగ్రహం భక్తులకు దర్శనం ఇవ్వడంతో స్వామి వారిని ఆలయంలో పెట్టి పూజలు మరింతగా చేయడం ప్రారంభించారు. శ్రీ ముఖ్యనాథస్వామి ఆలయంలో శివరాత్రి 2022 ముందు  రోజు(సోమవారం) పుట్టను తవ్వుతుండగా పుట్టలో మహాశివలింగం దర్శనం ఇవ్వడంతో భక్త కోటి జనం స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. ఇక ఆ రోజు నుండి శ్రీ ముఖ్యనాథస్వామి దేవాలయం అభివృద్ధి వైపు అడుగులు వేసింది. దాతల సహకరంతో దేవాలయం కమిటీ ఛైర్మెన్ శివసాని ప్రవీణ్ ఆధ్వర్యములో ఆలయానికి శాశ్వత విద్యుత్ లైన్ నిర్మాణం చేశారు.అదే విధంగా ఆలయానికి ప్రత్యేక దారిని కూడా నిర్మించారు. ఇలా ఒక్కొకటిగా ఆలయానికి అన్ని మౌలిక 19నవంబర్2023 రోజున ఆలయం పునఃప్రాణ ప్రతిష్ట చేపట్టడం జరిగినది. ఈ రకంగా ఆలయ పునఃనిర్మాణ వ్యవస్థాపకులు మరియు ఛైర్మన్ శ్రీ శివసాని ప్రవీణ్ రవీంద్ర కొనసాగుతూ ఆలయ అభివృద్ధికి తోడ్పడుతున్నారు.

Spread the love