విభజించే ప్రయత్నం చేస్తే సహించం..

– మున్నూరు కాపు సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మామిండ్ల అంజయ్య,
నవతెలంగాణ మద్నూర్
మున్నూరు కాపుల ఐక్యమత్యాన్ని విభజించే ప్రయత్నం చేస్తే సహించేది లేదని కులంకు చిచ్చు పెడితే ఊరుకునేది లేదని కులస్తుల్లో లొల్లి పెట్టడానికి ఇక్కడికి రాలేదని డాక్టర్ పై కేసు పెట్టినట్లు తెలిసిన సమాచారం మేరకే మద్నూర్ కు రావడం జరిగిందని కేసు విషయంలో మద్నూర్ ఎస్సై తో మాట్లాడడం జరిగిందని ఈ విషయంలో జుక్కుల్ ఎమ్మెల్యే హనుమంతు సిందేను కలిసి మాట్లాడతానని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మున్నూరు కాపులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ ను ప్రతి మండల కేంద్రంలో తాసిల్దార్లకు వినతి పత్రాలు అందజేయాలని ప్రతి మండలాన్ని సందర్శించి మండల మున్నూరు కాపు సంఘం నాయకులతో సమావేశం కావడం జరుగుతుందని కామారెడ్డి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు మామిళ్ల అంజయ్య ఆదివారం నాడు మద్నూర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలిపారు. మద్నూర్లో మున్నూరు కాపు కులస్తులంతా ఐక్యమత్యంగా ఉండటమే గత కొన్ని సంవత్సరాల కాలంగా సర్పంచ్ పదవిని గెలుచుకోవడం జరుగుతుందని ఇలాంటి ఐకమత్యమే కులానికి బలం అని తెలిపారు. మున్నూరు కాపు మా న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రం అందించడం డిమాండ్ల పరిష్కారానికి మున్నూరు కాపు కులస్తులమంతా ఐకమత్యంగా పోరాటాలు చేసి సాధించుకుందామని ఆయనే సందర్భంగా పిలుపునిచ్చారు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఐదు వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు 33 జిల్లా కేంద్రాల్లో ప్రతి జిల్లా కేంద్రంలో మున్నూరు కాపు విద్యార్థిని విద్యార్థులకు హాస్టల్ భవనాల నిర్మాణం కోసం ఒక ఎకరం స్థలాన్ని కేటాయించి రెండు కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని కోరారు జనాభా ప్రాతిపదికన మహిళలకు అన్ని రంగాల్లో రాజకీయంగా సముచిత స్థానం కల్పించాలని కోక పేటలో మున్నూరు కాపులకు ప్రభుత్వం కేటాయించిన ఐదు ఎకరాల స్థలంలో ఐదు కోట్ల రూపాయలు నిధులు ఏ విధంగా సరిపోవడం లేదని జనాభా నిష్పత్తి ప్రకారం దానిని రెట్టింపు చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన డిమాండ్ చేశారు ఈ విలేకరుల సమావేశంలో మద్నూర్ మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ఎస్ గంగారం, జుక్కల్ మండల అధ్యక్షులు వినోద్, బిచ్కుంద అరవింద్ జుక్కల్, నియోజకవర్గ అధ్యక్షులు జి మొగులయ్య, మద్నూర్ గ్రామ అధ్యక్షులు డాక్టర్ బండి వార్, విజయ్ వీరితోపాటు మద్నూర్ గ్రామ సర్పంచ్ సురేష్ ,మాజీ జెడ్పిటిసి సభ్యులు సాహెబ్ రావు, మాజీ సింగిల్ విండో చైర్మన్, పాకల్ వార్ విజయ్, హనుమాన్లు, స్వామి తదితరులు పాల్గొన్నారు.
Spread the love