
– మండలంలో 1835 పిల్లలకు పల్స్ పోలియో వ్యాక్సిన్
– 23 బూత్ లు, మొబైల్ టీంలతో వ్యాక్సిన్ పర్యవేక్షణ
– వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు పూర్తి
నవతెలంగాణ – బెజ్జంకి
నేడు దేశ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్నాయి. చిన్నారుల నిండు ప్రాణానికి రెండు పోలియో చుక్కలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.పల్స్ పోలియో రహిత సమాజం కోసం ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాయి.ఇందుకోసం 0-5 ఎండ్ల వయస్సుగల చిన్నారులు ఎలాంటి ఆనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న విధిగా రెండు పోలియో చుక్కలు వేయించాల్సిన బాధ్యత అందరిపైన ఉంది.ప్రతి ఒక్కరూ పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైద్య శాఖాధికారులు తెలిపారు. మండలంలోని 23 గ్రామ పంచాయతీల్లో 23 పోలియో చుక్కల పంపిణీ కేంద్రాలను వైశ్యశాఖాధికారులు ఏర్పాటు చేశారు. మొబైల్ టీంలతో పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు పర్యవేక్షించనున్నారు.మండలంలో 1835 (బెజ్జంకి-1029,తోటపల్లి 806) మంది చిన్నారులుండగా బెజ్జంకి,తోటపల్లి ఆరోగ్య కేంద్రాల సిబ్బంది పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమంలో విధులు నిర్వర్తిస్తున్నారు.అదివారం అందుబాటులో లేకుండా పోలియో చుక్కలు వినియోగించుకొలేని చిన్నారులకు మరుసటి రోజు నుండి గ్రామాల్లో ఆరోగ్య సిబ్బంది ఇంటింటా సర్వే నిర్వహించి పూర్తి స్థాయిలో పోలియో చుక్కల పంపిణీ ప్రక్రియ చేపట్టనున్నారు.
పల్స్ పోలియో కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి: మండలంలోని బెజ్జంకి,తోటపల్లి ఆరోగ్య కేంద్రం పరిధిలో(0-5) వయస్సు గల పిల్లలకు పల్స్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశాం.ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలియో కార్యక్రమం చేపట్టాం. అందుబాటులో లేకుండా సద్వినియోగం చేసుకొలేనివారికి తదుపరి రోజు నుండి ఇంటింటా పల్స్ పోలియో కార్యక్రమం చేపడుతాం..- వినోద్ బాబ్జీ, వైద్యాధికారి బెజ్జంకి.