డిచ్ పల్లిలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

– మృతుడు మధ్యప్రదేశ్ కార్మికుడిగా గుర్తింపు
నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని 44 వ నెంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరు గాయాల పాలైనట్లు ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు. ఎస్సై, స్థానికులు తెలిపిన వివరాల  ప్రకారం ఇందల్ వాయి మండలంలోని ఎల్లారెడ్డి పల్లి గ్రామ శివారులోని స్టోన్ క్రషర్ లో పనిచేస్తున్న నరేందర్, ఆశిష్, బబ్లు అనే ముగ్గురు కార్మికులు స్టోన్ క్రషర్ కు చెందిన పికప్ వాహనంలో డీజిల్ తెచ్చేందుకు పెట్రోల్ బంకుకు వెళ్లే క్రమంలో గంగారం తండా వద్ద ముందర ఉన్న లారీని అతివేగంతో ఢీ కొన్నారు. ఈ ప్రమాదంలో వాహనం నడుపుతున్న నరేందర్, ఆశిష్ కి గాయాలు కాగా బబ్లు (45) మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. గాయాలన వారందరినీ టోల్ ప్లాజా హైవే అంబులెన్స్,104అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఆసుపత్రి కి తరలించగా బొబ్బలు మృతి చెందాగా ఇద్దరు చికిత్స పొందుతున్నారు. మృతుడు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాడని, మృతునికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. గత కోన్ని ఏళ్ల క్రితం స్టోన్ క్రషర్ లో పని చేస్తుండే వాడని స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని మృత దేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించినట్లు వివరించారు. తోటి కార్మికుడు ముత్యాల సాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు.
ఆలస్యంగా సమాచారం:
శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న శనివారం రాత్రి వరకు 24 గంటలు గడిచిన సమాచారం అందజేయడానికి,  వివరాలను వెల్లడించడానికి ససేమిరా అంటున్నారు. ఎందుకు సమయానికి సమాచారం అందజేయడం లేదో తేలియడం లేదు. ఇకనైన ప్రెస్ కు అందజేసే సమాచారంను సమయాను సారం అందజేసే విధంగా ఉన్నతాధికారులు అదేశించాలని పలువురు విలేకరులు కోరుతున్నారు.
Spread the love