కూకట్‌పల్లిలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : కూకట్‌పల్లి పరిధిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న డిసీయం వాహనాన్ని వెనుక నుండి ఢీకొట్టింది ఓ బైక్. ఈ సంఘటనలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో యువకుడికి తీవ్రగాయాలు కాగా.. అతని పరిస్థితి విషమంగా ఉంది. ఇక ఈ సంఘటనకు సంబంధించిన విజువల్స్‌ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. బైక్ పై ట్రిపుల్ రైడింగ్ తో ఓవర్ స్పీడ్ గా వచ్చిన యువకులు…ఆగి ఉన్న డిసీయం వాహనాన్ని ఢీ కొట్టారు. ఇక ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన యువకుల వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love