Monday, June 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనకిలీ జీవోల తయారీ కేసులో మరో ఇద్దరు అరెస్ట్

నకిలీ జీవోల తయారీ కేసులో మరో ఇద్దరు అరెస్ట్

- Advertisement -

హైడ్రా కమిషనర్ రంగనాథ్ తోపాటు పలువురు ఉన్నతాధికారుల సంతకాలు ఫోర్జరీ
నకిలీ డాక్యుమెంట్లు, స్టాంప్స్, చెక్ బుక్స్, 
పాస్ బుక్స్, ల్యాప్ టాప్ లు స్వాధీనం
పరారీలో మరో ఐదుగురు
వివరాలు వెల్లడించిన శేరిలింగంపల్లి జోన్ 
డీసీపీ శ్రీనివాస్

నవతెలంగాణ – శేరిలింగంపల్లి
నకిలీ జీవోల తయారు చేసి ప్రభుత్వ భూమిని అమ్మేందుకు యత్నించిన కేసులో పోలీసులు మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో పాటు పలువురు ఉన్నతాధికారుల సంతకాలు ఫోర్జరీ చేసినట్టు గుర్తించారు. వీరి నుంచి నకిలీ డాక్యుమెంట్లు స్టాంప్స్, చెక్ బుక్స్, పాస్ బుక్స్, ల్యాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను శేరిలింగంపల్లి జోన్ డీసీపీ శ్రీనివాస్ ఆదివారం మీడియాకు వెల్లడించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగి పోలీస్ స్టేషన్‌లో, గoడిపేట గ్రామం సర్వే నం. 18లో ఉన్న విలువైన ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకునే కుట్రలో భాగంగా, నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు, తప్పుడు అధికారిక రికార్డులను సృష్టించినందుకు పలువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గతంలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా వెలాది రాధాకృష్ణ, తని డ్రైవర్ గ్యార ప్రవీణ్ కుమార్ ను అరెస్టు చేశారు. వెలాది రాధాకృష్ణ 2006 నుంచి 2009 వరకు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని ఐటీ అండ్ సీ విభాగంలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేశాడు. ఆ సమయంలోనే ప్రభుత్వ కార్యాలయాల్లోని పని విధానాలపై అతనికి అవగాహన ఏర్పడింది. ఆ తర్వాత అతను తన ఉద్యోగాన్ని మానేసి, ఆ పరిచయాలను అడ్డుపెట్టుకుని ప్రభుత్వ ఉద్యోగాలు, భూ క్రమబద్ధీకరణ ఉత్తర్వులు, పట్టాదారు పాసుపుస్తకాలు, వారసత్వ ప్రక్రియలు, ఇతర ప్రభుత్వ అనుమతులను ఇప్పించగలనని నమ్మిస్తూ ప్రజలను మోసం చేయడం ప్రారంభించాడు.

ఈ విధంగా తాను న్యాయవాదిగా ఉంటూ బార్ అసోసియేషన్ లో సభ్యుడిగా ఉంటూ సచివాలయంలో పనిచేస్తున్నానని, డిప్యూటీ కలెక్టర్ గా చె ప్పుకుంటూ, మొదటగా 2013లో నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి మోసం చేశాడు. వారి నుంచి రూ.30 లక్షలు వసూలు చేశాడు. ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో, అతనిపై కేసులు నమదయ్యాయి. నల్లగొండలో వెంకటాచారి అనే వ్యక్తికి సచివాలయంలో అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని తప్పుడు వాగ్దానం చేసి, అతని నుంచి రూ. 18 లక్షలు వసూలు చేశాడు. ఇలా అనేక మందిని మోసం చేస్తూ.. లక్షల్లో డబ్బులు వసూలు చేశారు. ఈ క్రమంలనే గండిపేట గ్రామం సర్వే నం.18 లోని ప్రభుత్వ పోరంబోకు భూమిపై హక్కులు ఉన్నాయని చెప్పుకుంటున్న వ్యక్తులతో అతను పరిచయాలు పెంచుకున్నాడు. అలాగే తన డ్రైవర్ గ్యారా ప్రవీణ్ ద్వారా, అతను కొవ్వూరు సునీల్‌తో పరిచయం పెంచుకున్నాడు. గండిపేట గ్రామం సర్వే నం.18 భూమికి సంబంధించి, ఆ గ్రామానికి చెందిన నిమ్మల రాజేష్, నిమ్మల వేణుగోపాల్, నిమ్మల రామస్వామి, గారెలా మంగ.. వారి కుటుంబ సభ్యులతో అతను సంబంధాలు ఏర్పరచుకున్నాడు. సదరు భూమి ప్రభుత్వ పోరంబోకు భూమి అని, దానిపై ఎటువంటి చట్టపరమైన యాజమాన్య హక్కులు లేవని రాధాకృష్ణకు తెలిసినప్పటికీ, ఆ భూమిని కొనుగోలు చేయాలనుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకుడు బ్రహ్మనాయుడు, అతని సోదరుడు రమేష్‌కు ఆ భూమి క్రమబద్ధీకరణ, వారసత్వ హక్కులు, ఇతర ప్రభుత్వ అనుమతులను పొందవచ్చని అతను తప్పుడు హామీలు ఇచ్చాడు. ఈ క్రమంలో రాధాకృష్ణ, కొవ్వూరు సునీల్‌తో కలిసి సదరు భూమిపై చట్టపరమైన హక్కులను కల్పించే పత్రాలను తామే సిద్ధం చేసి ఇస్తామని నిమ్మల కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చి, వారి నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేశాడు.
నకిలీ పత్రాలు సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో గండిపేట తహసీల్దార్ నార్సింగి పీఎస్ లో కేసు పెట్టారు. పోలీసులు విచారణ చేపట్టి, ఈ కేసులో ఇప్పటి వరకూ 10 మందిని అరెస్ట్ చేశారు. మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నట్టు డీసీపీ తెలిపారు. అరెస్ట్ ఆయన వారి వద్ద నుంచి 31 నకిలీ డాక్యుమెంట్లు, 13 స్టాంప్స్, 12 చెక్ బుక్కులు,10 ఏటీఎం కార్డులు, 7 బ్యాంక్ పాస్ బుక్కులు, 5 ల్యాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -