బీజేపీ మండల అధ్యక్షుడిగా ఉడుత శ్యామ్

నవతెలంగాణ – పెద్దవంగర
బీజేపీ మండల నూతన అధ్యక్షుడిగా మండల కేంద్రానికి చెందిన ఉడుత శ్యామ్ నియమితులయ్యారు. శనివారం పార్టీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు యలమంచిలి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు ఉడుత శ్యామ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో పార్టీ అప్పజెప్పిన బాధ్యతలను వమ్ము చేయకుండా, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. సమన్వయంతో పని చేస్తూ, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేపడతామన్నారు. తన నియామకానికి సహకరించిన పాలకుర్తి నియోజవర్గ నాయకులు లేగ రామ్మోహన్ రెడ్డి, కర్ర శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు రంగు రాములు గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ధర్మారపు వెంకన్న, తొర్రూరు మున్సిపాలిటీ కౌన్సిలర్, జిల్లా కార్యదర్శి కొలుపుల శంకర్, నియోజకవర్గ కన్వీనర్ పూసాల శ్రీమాన్, కో-కన్వీనర్‌ సుంకరనేని కోటేశ్వరరావు, సాయిని ఝాన్సీ రవి లకు కృతజ్ఞతలు తెలిపారు.

Spread the love