శతాబ్ది ఉత్సవం నాడూ ఆగని నిరసనలు

– అధికార పార్టీ నేతలను అడ్డుకున్న అన్నదాతలు….
నవతెలంగాణ-మంథని
ఓ వైపున మంథని డివిజన్ కేంద్రంలో దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటూ సంబరాల్లో మునిగి తేలుతుంటుంటే ఇక్కడ మాత్రం అధికార పార్టీ నాయకులకు అన్నదాతల నుండి నిరసన సెగ తగిలింది. పెద్దపల్లి జిల్లా మంథనిలో జరిగిన ఈ ఘటనలో రైతులు దాన్యం కొనుగోళ్ల తీరుపై చేపట్టిన ఆందోళన దశాబ్ది ఉత్సవాల నాడు గందరగోళంగా మారింది. పెద్దపల్లి జిల్లా మంథని మార్కెట్ యార్డు ఆవరణలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించేందుకు మార్కెట్ కమిటీ యార్డ్ లో వేడుకలు నిర్వహించేందుకు మార్కెట్ కమిటీ చైర్మన్ తో పాటు పాలకవర్గ సభ్యులు,నాయకులు కార్యక్రమానికి వెళ్లారు.కాగా మార్కెట్ యార్డులో ధాన్యం విక్రయించేందుకు వచ్చిన రైతులు నాయకులను అడ్డుకోగా నాయకులు బలవంతంగా లోపలకు వెళ్లారు.జాతీయ పతాకావిష్కరణ చేస్తున్న తరుణంలో మార్కెట్ యార్డు గేటు వేసి రైతులు నిరసన వ్యక్తం చేశారు.సకాలంలో ధాన్యం కొనకపోవడంతో తాము ఇబ్బంది పడుతున్నామని,వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.నిలిచిపోయిన ధాన్యం కొనుగోల్లను వెంటనే జరిపించాలని రైతులు డిమాండ్ చేశారు.

Spread the love