Sunday, August 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా 4వ మహాసభల కరపత్రాల ఆవిష్కరణ

భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా 4వ మహాసభల కరపత్రాల ఆవిష్కరణ

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌన్ 
భారత జాతీయ మహిళా సమైక్య జిల్లా 4వ మహాసభలు విజయవంతం చేయాలని, మహిళా సమైక్య మండల నాయకురాలు, మాటూరు జానమ్మ అన్నారు. భారత జాతీయ మహిళా సమాఖ్య 1931లో ఏర్పడి , నాటి నుండి దేశంలో రాష్ట్రంలో మహిళల పైన జరుగుతున్న అఘాయిత్యాలు, అసమానతలు, అత్యాచారాలు, అన్యాయాలు ఎదుర్కొంటూ ముందుకు సాగుతు ఉద్యమ చరిత్ర లిఖించిందని చెప్పారు. స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు చట్టసభల్లో 33% రిజర్వేషన్ల కొరకు ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తూనే 2023 పార్లమెంట్లో మహిళా బిల్లును ప్రవేశపెట్టాలని ఉద్యమించామన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్ మాట్లాడుతూ .. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉద్యమంలో  పోరాడిన మహిళ స్ఫూర్తితో మహిళా సమాఖ్య కార్యక్రమాలను సమీక్షిస్తూనే వాటి పరిష్కారం కొరకు భవిష్యత్తు పోరాటంకై ఉద్యమం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో  పిట్టల శ్రీదేవి, ఆలేటి పూలమ్మ,లక్ష్మి, జయమ్మ ,జహంగీర్ బి, పరశురాములు, దార ఉదయం, బొడ్డు ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -