Saturday, May 9, 2026
E-PAPER
HomeNewsనిరాహారదీక్ష ప్రారంభించిన వి హనుమంతరావు

నిరాహారదీక్ష ప్రారంభించిన వి హనుమంతరావు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆమరణ నిరాహారదీక్షను ప్రారంభించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన దీక్షకు దిగారు. బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆయన దీక్షను ప్రారంభించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీల అభ్యున్నతి జరగాలంటే, ముందుగా వారి జనాభా ఎంత ఉందో స్పష్టంగా తెలియాలని వీహెచ్ వాదిస్తున్నారు. జనగణనలో బీసీ కులాలను కూడా లెక్కించడం ద్వారానే విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో జనాభా ప్రాతిపదికన న్యాయం జరుగుతుందని చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -