నవతెలంగాణ-హైదరాబాద్: బెంగాల్ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో నిలువెత్తు నిర్లక్ష్యం దాగి ఉందని, ప్రతి అంశంలో తప్పిదాలు జరిగాయని, కేంద్ర ఎన్నికల సంఘం పట్టింపు లేకుండా వ్యవహరించిందని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. బెంగాల్‌లో అనేక ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపును ఆపారని సోషల్ మీడియా వేదికగా ఆమె వీడియో విడుదల చేశారు.
“ఎన్నికల సంఘం పూర్తిగా ఇష్టానుసారం వ్యవహరిస్తోంది, కేంద్ర బలగాలు కూడా వారికి అండగా ఉన్నాయి. పోలీసులు కూడా కేంద్ర బలగాలతో కలిసి పని చేశారని, బీజేపీకి లబ్ధి చేకూర్చే వ్యూహంలో భాగంగానే అనేక చోట్ల ఓట్ల లెక్కింపును నిలిపివేశారని కూడా ఆమె ఆరోపించారు. “లెక్కింపు ఏజెంట్లు మరియు అభ్యర్థులు లెక్కింపు కేంద్రాలను విడిచి వెళ్లకూడదని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇది బీజేపీ పన్నాగం, మొదట వారినే ఆధిక్యంలో ఉన్నట్లు చూపిస్తారని, వారు(ఈసీ) అనేక చోట్ల లెక్కింపును నిలిపివేశారు, కళ్యాణిలో ఫలితాలు సరిపోలని EVMలు బయటపడ్డాయి, కేంద్ర బలగాల ద్వారా అన్ని వైపుల నుండి TMC పై దాడులు జరుగుతున్నాయి,” అని ఆమె వీడియాలో పేర్కొన్నారు.



