నవతెలంగాణ-వైరాటౌన్: సీపీఐ(ఎం) వైరా అసెంబ్లీ అభ్యర్థి భూక్యా వీరభద్రం విజయాన్ని కాంక్షిస్తూ వైరా మండలం రెబ్బవరం గ్రామంలో తాళ్లూరి ధనలక్ష్మి భూక్యా వీరభద్రంకు వీర తిలకం దిద్ది, హారతి ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా నాయకులు బొంతు రాంబాబు, పారుపల్లి ఝాన్సీ, మండలం నాయకులు తూము సుధాకర్, తాళ్లూరి నాగేశ్వరరావు, గుత్తా రామకృష్ణ, తుమ్మల రమేష్, దొబ్బల నాగయ్య, తాళ్లూరి రామకృష్ణ, షేక్ రఫీ, షేక్ సైదులు, తూము సురేష్, సామినేని బాబు తదితరులు పాల్గొన్నారు.