తీన్మార్ మల్లన్న ను భారీ మెజారిటీ తో గెలిపించాలి: వీరన్న నాయక్

నవతెలంగాణ – చివ్వేంల
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ను భారీ మెజారిటీ తో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరావత్ వీరన్న నాయక్ అన్నారు.  సోమవారం స్థానిక విలేకరులతో  మాట్లాడుతూ  రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని, 400 సీట్లు యివ్వాలని   ప్రచారం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి బీజేపీ అభ్యర్థికి పట్టబద్రులు తగిన గుణపాఠం చెప్పాలన్నారుజేపీ. ఎస్సీ,ఎస్టీ,బీసీ హక్కులను కాలరాసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని విమర్శించారు. ఆరు సంవత్సరాల పాటు పట్టభద్రులకు అండగా ఉండాలని పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపిస్తే మూడు సంవత్సరాల కాలంలోనే రాజీనామా చేసి పట్టభద్రులను నడిరోడ్డు మీద వదిలేశారన్నారు. 2017 లో పల్లా ఉద్యోగుల ను, నిరుద్యోగ యువకులను ప్రలోబపెట్టి డబ్బు మద్యం తో గెలిచారని, బిఆర్ఎస్ ప్రభుత్వం  పలు  జీవోలు తెచ్చి నిరుద్యోగ యువకుల ను, ఉద్యోగస్తులను కన్నీళ్లు పెట్టించిందన్నారు.  తీన్మార్ మల్లన్న ఎందుకు జైలుకుపోయిండు మల్లన్న పై ఎన్ని కేసులు ఉన్నాయో వీటికి కారణం ఎవరో పట్టభద్రులకు తెలుసని  అన్నారు. మూడు ఉమ్మడి జిల్లాల్లో బలమైన క్యాడర్ కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు. పట్టభద్రులంతా తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించుకుందామని సూచించారు.
Spread the love